సిరిసిల్లలో కేటీఆర్‌ రాజీనామాకు సిద్ధమా?

కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేసేందుకు కేటీఆర్‌ సిద్ధమా? అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు.

Published : 02 Mar 2024 04:41 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేసేందుకు కేటీఆర్‌ సిద్ధమా? అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్లమెంటు పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు కేటీఆర్‌పై పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. సిరిసిల్ల స్థానానికి కేటీఆర్‌ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. అవినీతిపై భవిష్యత్తులో కేటీఆర్‌కు శిక్ష తప్పదన్నారు. శుక్రవారమిక్కడ ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘40-50 పిల్లర్లు ఉన్నచోట రెండు కుంగితే నష్టం లేదని కేటీఆర్‌ అంటున్నారు. మన ఇంట్లో రెండు పిల్లర్లు కుంగితే నష్టం ఉండదా. మేడిగడ్డ వద్దకు కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారని అన్నారు... ఇప్పుడు కేటీఆర్‌, భారాస నాయకులు ఎందుకు వెళ్తున్నారు? జైకా నుంచి రుణం తీసుకుని ఈ ప్రాజెక్టునూ నాణ్యంగా నిర్మించలేదు. రాష్ట్రంలో ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ, రూ.500గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో భారాస ఉనికి కోల్పోతుందని భయపడుతున్నారు. నీళ్లు వదిలిపెట్టి ప్రాజెక్టు కొట్టుకుపోకుండా కాపాడుకున్నాం. కాళేశ్వరంపై డ్యాంసేఫ్టీ అథారిటీ అధికారుల సలహా మేరకు ముందుకు వెళ్తాం. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. గత ఐదేళ్లుగా నియోజకవర్గాల్లో తిరగని నాయకులు.. పాదయాత్రలతో తమపై తామే కోడిగుడ్లు వేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారు.’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని