సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

మీ చెల్లెలే మా అన్నకు ఓటేయొద్దు, ఘోరంగా ఓడించండి అని విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పడాన్ని మించిన చర్య మరొకటి ఉంటుందా? అని సీఎం జగన్‌ను తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.

Published : 02 Mar 2024 05:13 IST

సీఎం జగన్‌కు వర్ల రామయ్య ప్రశ్న

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మీ చెల్లెలే మా అన్నకు ఓటేయొద్దు, ఘోరంగా ఓడించండి అని విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పడాన్ని మించిన చర్య మరొకటి ఉంటుందా? అని సీఎం జగన్‌ను తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీత లేవనెత్తిన అనుమానాలు, వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. అసలు హత్య కుట్రలో జగన్‌ పాత్రపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ చేయించాలని గవర్నర్‌కు జగన్‌ లేఖరాశారు. హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. తీరా సీఎం అయ్యాక దాన్ని వెనక్కి తీసుకున్నారు’’ అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని