గుక్కెడు నీళ్లడిగితే ప్రాణాలు తీస్తారా?

తాగేనీళ్ల దగ్గర కూడా పార్టీల పేరుతో పక్షపాతం చూపడం దారుణమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Published : 02 Mar 2024 05:14 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి : తాగేనీళ్ల దగ్గర కూడా పార్టీల పేరుతో పక్షపాతం చూపడం దారుణమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో బాణావత్‌ సామునిబాయ్‌ అనే ఎస్టీ మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుక్కెడు నీళ్లు అడిగితే ప్రాణాలు తీస్తారా? అని వైకాపా ప్రభుత్వాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో నిలదీశారు. జగన్‌ పాలన రాతియుగం కాక మరేంటి? అని మండిపడ్డారు. ‘‘నా ఎస్సీలు, నా ఎస్టీలు అనే జగన్‌రెడ్డికి వారిపై జరుగుతున్న మారణకాండ కనిపించడం లేదా? వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే పల్నాడులో అధికార పార్టీ కార్యకర్తలు కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. ఎస్టీ మహిళను చంపిన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని