‘జగన్‌ను విమర్శిస్తే గొంతు కోస్తా’

‘సీఎం జగన్‌ను ఫేస్‌బుక్‌లో విమర్శిస్తావా? ఏమనుకుంటున్నావ్‌! ఇంటికొచ్చి కొడతా. నేను సైకోని.

Published : 03 Mar 2024 06:18 IST

కుప్పం నియోజకవర్గంలో తెదేపా సర్పంచి భర్తపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డ వైకాపా కార్యకర్త

ఈనాడు, చిత్తూరు: ‘సీఎం జగన్‌ను ఫేస్‌బుక్‌లో విమర్శిస్తావా? ఏమనుకుంటున్నావ్‌! ఇంటికొచ్చి కొడతా. నేను సైకోని. జగన్‌ కోసం గొంతు కోసుకుంటా.. నీ గొంతైనా కోస్తా.. కుప్పంలో ఎలా తిరుగుతావో చూస్తా’ అంటూ ఓ వైకాపా కార్యకర్త చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలోని తెదేపా  సర్పంచి రీటా భర్త ఎల్లప్పను శనివారం సాయంత్రం సెల్‌ఫోన్‌లో బెదిరించారు. రాయలేని భాషలో అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ కార్యకర్త కుప్పం నియోజకవర్గంలో అధికార పార్టీలోని కీలక నాయకుడికి అనుచరుడు. ‘నీది సామాజిక మాధ్యమాల్లో సీఎం జగన్‌ను గురించి విమర్శించే స్థాయి కాదు. మా బాస్‌ నన్ను ఆపుతున్నారు కాబట్టే నువ్వు రోడ్డుపై తిరుగుతున్నావు. లేకుంటే కుప్పంలో అడుగుపెట్టనివ్వను. ఎమ్మెల్సీ కంచర్ల, చంద్రబాబు పీఏ మనోహర్‌.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. నీ అంతు చూస్తా’ అని బెదిరించారు. అధికార పార్టీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు ఎల్లప్ప ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గుడుపల్లె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని