Bandi Sanjay: ‘ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా..!’

‘‘లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. ఒకవేళ నేను గెలిస్తే కేసీఆర్‌, కేటీఆర్‌ భారాస దుకాణాన్ని మూసుకుని ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారా’’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్‌..

Updated : 08 Mar 2024 08:42 IST

నేను గెలిస్తే ‘భారాస’ను మూసివేస్తారా?
కేటీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌

చొప్పదండి, న్యూస్‌టుడే: ‘‘లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. ఒకవేళ నేను గెలిస్తే కేసీఆర్‌, కేటీఆర్‌ భారాస దుకాణాన్ని మూసుకుని ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారా’’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్‌.. మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. ప్రజాహిత యాత్రలో భాగంగా కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన సంజయ్‌ చొప్పదండి అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌ షోలో మాట్లాడారు. బండి సంజయ్‌ ఎప్పుడూ రాముడి పేరు చెబుతుంటారని తనను విమర్శిస్తున్నారని.. రాముడి పేరు కాకపోతే రావణుడి పేరు చెప్పాలా అని కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. మహారాష్ట్రలో పార్టీ కార్యాలయం తెరిచి కిరాయి కట్టకుండా.. అక్కడి నేతను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని విమర్శించారు. కరీంనగర్‌ అభివృద్ధిపై కేటీఆర్‌ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని, చర్చకు సిద్ధంగా ఉన్నానని.. కేసీఆర్‌ను కూడా తీసుకు రావాలని సవాల్‌ విసిరారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేనిపక్షంలో కరీంనగర్‌లో అడుగుపెట్టనీయబోమన్నారు. చేసిన అభివృద్ది, రామమందిరం ఎజెండాతో ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, భాజపా నేతలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని