సమన్వయంతో పనిచేసి ఎంపీ సీట్లు గెలుద్దాం

గత వందరోజుల ప్రజాపాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేసిన గ్యారంటీ హామీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతలకు సూచించారు.

Updated : 28 Mar 2024 16:35 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: గత వందరోజుల ప్రజాపాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేసిన గ్యారంటీ హామీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతలకు సూచించారు. ఆదివారం రాత్రి ఆయన నివాసంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార కార్యక్రమాలపై ఈ సందర్భంగా నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ‘‘పోలింగ్‌ బూత్‌ల వారీగా పార్టీ నేతలు బాధ్యత తీసుకుని ప్రచారం నిర్వహించడంతో పాటు, పార్టీకి ఓట్లు పడేలా పనిచేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవను వివరించాలి. ఉమ్మడి జిల్లాలోని అన్నిస్థాయుల నేతలు సమన్వయంతో రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను, అలానే ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలి’’ అని సీఎం సూచించారు. సమావేశంలో మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని