అవినీతి పార్టీలతో పొత్తు అక్కర్లేదు: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

కాంగ్రెస్‌, భారాస రెండూ పొత్తు పార్టీలని, గతంలో మంత్రి పదవులు పంచుకున్నాయని నిర్మల్‌ ఎమ్మెల్యే, భాజపా శానససభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 28 Mar 2024 03:33 IST

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌, భారాస రెండూ పొత్తు పార్టీలని, గతంలో మంత్రి పదవులు పంచుకున్నాయని నిర్మల్‌ ఎమ్మెల్యే, భాజపా శానససభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌తో కలిసి నిర్మల్‌లో బుధవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం భాజపాకు లేదని చెప్పారు. ప్రస్తుత సీఎం వసూళ్లే లక్ష్యంగా కుర్చీలో కూర్చున్నట్లుందని మండిపడ్డారు. మూడు నెలల కాలంలో దాదాపు రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని, దిల్లీ పెద్దలకు రూ.1,500 కోట్లు పంపించారని ఆరోపించారు. ఎక్కడెక్కడ ఎంత వసూలు చేస్తున్నారో జాబితా తమవద్ద ఉందన్నారు. భారాస ఎమ్మెల్సీ కవిత మద్యం వ్యవహారంలో ఆర్థిక నేరానికి పాల్పడినట్లు ఆధారాలు ఉండటంతోనే ఈడీ అరెస్టు చేసిందని, ఈ విషయంలో భాజపాకు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని