భారాస ఆరిపోయే దీపం: మధుయాస్కీగౌడ్‌

భారాస పార్టీ ఆరిపోయే దీపం అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

Published : 28 Mar 2024 03:35 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భారాస పార్టీ ఆరిపోయే దీపం అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎ1, ఎ2 గా కేసీఆర్‌, కేటీఆర్‌ ఉంటారన్నారు. అధికారుల విచారణ తర్వాత వారిని విచారించే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్‌ వంద రోజుల పాలన చూసి కేటీఆర్‌ భయపడుతున్నారని, అన్ని శాఖలలో భారాస అనుకూల అధికారులు ఇంకా పోస్టింగుల్లో కొనసాగుతున్నారని, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత అవినీతి అధికారులపై విచారణ జరిగే అవకాశముందని పేర్కొన్నారు. దిల్లీలో ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని మాత్రమే ఏఐసీసీ తప్పు పట్టిందని, విచారణను వ్యతిరేకించలేదని తెలిపారు. భువనగిరి ఎంపీగా పోటీ చేస్తే గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని రాజగోపాల్‌రెడ్డి అన్నారు కానీ.. నాకు ఇష్టం లేదని చెప్పా అని మధుయాస్కీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని