మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌ కాంగ్రెస్‌లో చేరిక

మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌.. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తలకొండపల్లి మండలం సంగాయిపల్లిలో బుధవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి(కల్వకుర్తి), వంశీకృష్ణ (అచ్చంపేట) సమక్షంలో చిత్తరంజన్‌దాస్‌కు మల్లు రవి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Published : 28 Mar 2024 03:37 IST

తలకొండపల్లి, న్యూస్‌టుడే: మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌.. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తలకొండపల్లి మండలం సంగాయిపల్లిలో బుధవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి(కల్వకుర్తి), వంశీకృష్ణ (అచ్చంపేట) సమక్షంలో చిత్తరంజన్‌దాస్‌కు మల్లు రవి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చిత్తరంజన్‌దాస్‌ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో జడ్చర్లలో భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1989లో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై చిత్తరంజన్‌దాస్‌ కల్వకుర్తిలో విజయం సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని అనివార్య కారణాలతో భాజపాలోకి వెళ్లానని.. మళ్లీ కాంగ్రెస్‌లో చేరడంతో సొంత గూటికి వచ్చినట్లుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్‌, యాట నర్సింహ, గట్ల కేశవరెడ్డి, మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు