రైతులకిచ్చిన హామీలేమయ్యాయి?

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వంద రోజులు ఏనాడో దాటిపోయిందని.. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని భారాస నేతలు దేవీప్రసాద్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విమర్శించారు.

Published : 28 Mar 2024 03:39 IST

భారాస నేతలు దేవీప్రసాద్‌, ఎర్రోళ్ల

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వంద రోజులు ఏనాడో దాటిపోయిందని.. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని భారాస నేతలు దేవీప్రసాద్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విమర్శించారు. రైతులకిచ్చిన హామీలేమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రైతుభరోసా సాయంపై మంత్రులు పచ్చి అబద్ధాలాడుతున్నారు. 93 శాతం మంది రైతులకు ఆ సొమ్ము అందిందని మంత్రులు చెబుతున్నా.. మూడెకరాల లోపు రైతులకు కూడా పడలేదు. రైతు రుణమాఫీ ఊసే లేదు. 170 మండలాల్లోని 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. మంత్రి జూపల్లి పాలన మీద దృష్టి పెట్టకుండా హరీశ్‌రావుపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని వారు విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు