ఓట్లు చీల్చాలనుకునేవారి చేతులు నరికేయాలి

లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలో ఎవరైనా ఓట్ల చీలిక గురించి మాట్లాడితే వారిని వదిలిపెట్టకుండా చేతులు నరికేయాలని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు వీర్‌ సింగ్‌ భూరియా తన అనుచరులను రెచ్చగొట్టేలా పిలుపునిచ్చారు.

Published : 28 Mar 2024 03:53 IST

 మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

ఝాబువా: లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలో ఎవరైనా ఓట్ల చీలిక గురించి మాట్లాడితే వారిని వదిలిపెట్టకుండా చేతులు నరికేయాలని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు వీర్‌ సింగ్‌ భూరియా తన అనుచరులను రెచ్చగొట్టేలా పిలుపునిచ్చారు. అలా నరికితేనే వారు తమను గుర్తిస్తారన్నారు. ఒక సామాజికవర్గం వారిని దొంగలు, దోపిడీదారులుగా అభివర్ణించారు. ఝాబువా భాజపా అభ్యర్థి అనితా చౌహాన్‌ను ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలోని ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. దీనిపై కేసు పెడతామని అనితా చౌహాన్‌ భర్త, మధ్యప్రదేశ్‌ మంత్రి నగర్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని