అరుణాచల్‌ సీఎం ఖండూ ఎన్నిక ఏకగ్రీవం!

అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లు ఏకగ్రీవం కానున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి పెమా ఖండూ, నలుగురు భాజపా నేతలున్నారు.

Published : 28 Mar 2024 04:06 IST

మరో నలుగురు భాజపా నేతలూ..

ఈటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లు ఏకగ్రీవం కానున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి పెమా ఖండూ, నలుగురు భాజపా నేతలున్నారు. బుధవారంతో ఇక్కడ నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ ఐదు చోట్లా భాజపా నేతలు మినహా ఎవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వారి ఎన్నికను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. తవాంగ్‌ జిల్లాలోని ముక్తో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఖండూ ఎన్నిక కానున్నారు. ఆయన 2010 నుంచి ఇక్కడ ఎన్నికవుతూ వస్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికల కానున్న భాజపా నేతల్లో సగాలీ నుంచి రాతు తెకీ, రోయింగ్‌ నుంచి ముచ్చు మితి, తాలి నుంచి జిక్కే టాకో, తలీహా నుంచి న్యాటో దుకం ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని