టీఎంసీ దోచుకున్న సొమ్ము పేదలకే

పశ్చిమబెంగాల్‌లో పేదల నుంచి కొందరు దోచుకున్న రూ.3,000 కోట్లు తిరిగి బడుగులకే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Published : 28 Mar 2024 04:07 IST

మహువా ప్రత్యర్థి రాజమాతకు ఫోన్లో తెలిపిన మోదీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో పేదల నుంచి కొందరు దోచుకున్న రూ.3,000 కోట్లు తిరిగి బడుగులకే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పటికే  ఈడీ జప్తు చేసిన సొమ్ము తిరిగి పేదలకు చెందేలా చేయాలని చూస్తున్నట్లు చెప్పారు.  బెంగాల్‌లోని కృష్ణానగర్‌ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రాపై పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి ‘రాజమాత’ అమృతా రాయ్‌తో బుధవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. బెంగాల్లో ప్రభుత్వోద్యోగాలు పొందేందుకు రూ.3,000 కోట్లను ప్రజలు లంచాలుగా చెల్లించాల్సి వచ్చిందని వారిమధ్య చర్చకు వచ్చింది. తిరిగి అధికారంలోకి రాగానే ఈ సొమ్మును ప్రజలకు చేరవేసేలా చట్టపరమైన ఏర్పాట్లు చేస్తానని ప్రజలకు తన మాటగా చెప్పాలని ప్రధాని తెలిపినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ ఎన్నికల్లో బెంగాల్‌ ప్రజలు మార్పును కోరుకుంటారని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని