తొలిదశకు ముగిసిన నామినేషన్లు

లోక్‌సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్‌ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Published : 28 Mar 2024 04:08 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్‌ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో 8 స్థానాలకు గానూ 155 నామినేషన్లు వచ్చాయి. ఒక్క ముజఫర్‌నగర్‌ స్థానంలోనే 23 మంది బరిలో ఉన్నారు. తమిళనాడులో 39 స్థానాలకూ ఒకే దశలో పోలింగ్‌ జరగనుండగా 1,403 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కరూర్‌ నుంచి రికార్డుస్థాయిలో 62 మంది పోటీ చేస్తున్నారు. పుదుచ్చేరిలోని ఏకైక స్థానానికి 34 మంది నామినేషన్లు వేశారు. మహారాష్ట్రలో ఐదు స్థానాలకు 183 మంది అభ్యర్థుల తరఫున 229 నామినేషన్లు వచ్చాయి. తొలిదశ సమరాంగణంలో ఉన్నవారిలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఒకరు. మధ్యప్రదేశ్‌లో ఆరు స్థానాలకు 113, రాజస్థాన్‌లో 12 నియోజకవర్గాలకు 130 మంది అభ్యర్థులు, బెంగాల్‌లో 3 స్థానాలకు 42 మంది, అస్సాంలో 5 స్థానాలకు కలిపి 38 మంది, జమ్మూకశ్మీర్‌లో ఉధంపుర్‌ స్థానానికి 15 మంది నామినేషన్లు వేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఒక్క స్థానానికి తొలిదశలో పోలింగ్‌ జరగనుండగా 12 మంది తలపడుతున్నారు. మొత్తం నామినేషన్లను గురువారం పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 30 వరకు గడువు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని