భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే

రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్‌, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది.

Updated : 28 Mar 2024 05:56 IST

పది స్థానాలకూ పేర్లను ప్రకటించిన పార్టీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్‌, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. లోక్‌సభ టికెట్‌ ఆశించి నిరాశ చెందిన సుజనాచౌదరికి విజయవాడ వెస్ట్‌ టికెట్‌ లభించింది. విశాఖ నార్త్‌ టికెట్‌ ఊహించినట్లే విష్ణుకుమార్‌రాజుకు దక్కింది. గతంలో ఇదే స్థానం నుంచి ఆయన చట్టసభకు ప్రాతినిధ్యం వహించారు. భాజపా జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌ లోక్‌సభ స్థానాన్ని ఆశించారు. ఆయనకు ధర్మవరం అసెంబ్లీ టికెట్‌ లభించింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే తొలిసారి. ధర్మవరం స్థానం గోనుగుంట్ల సూర్యనారాయణకు ఖరారు అవుతుందని భావించారు. గోనుగుంట్ల 2014 ఎన్నికల్లో  ఇదే స్థానం నుంచి తెదేపా తరఫున పోటీచేసి, గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఓడిన అనంతరం భాజపాలో చేరారు. తెదేపా నుంచి మంగళవారం భాజపాలో చేరిన రోషన్నకు బద్వేలు టికెట్‌ లభించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని