అనంతపురం జిల్లాలో ఘోరం..

అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్‌, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్‌ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.

Published : 28 Mar 2024 05:20 IST

వైకాపా అసమ్మతి నాయకుడి తోటకు నిప్పు

శింగనమల, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్‌, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్‌ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మండల పరిధిలోని చిన్నజలాలపురం గ్రామంలో నగేశ్‌కు నాలుగెకరాల మామిడి తోట ఉంది. ఎవరూ లేని సమయంలో తోట కంచెకు నిప్పు పెట్టారు. మంటలు వ్యాపించి కంచెతోపాటు బిందుసేద్యం పరికరాలు, విద్యుత్తు మోటారు, పైపులు, బీర సాగుకు తెచ్చిన కట్టెలు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయారు. నగేశ్‌ వైకాపా మండల కన్వీనర్‌గా కొనసాగుతున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు సాంబశివారెడ్డితో విభేదాలు వచ్చాయి. దాంతో నగేశ్‌ అసమ్మతి వర్గంలో కొనసాగుతున్నారు. 15 రోజుల కిందట ఆయన్ను మండల కన్వీనర్‌ పదవి నుంచి తప్పించారు. కక్ష సాధింపుతోనే గుర్తుతెలియని వ్యక్తులు తన మామిడి తోటకు నిప్పు పెట్టినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎస్సై చంద్రశేఖర్‌ తోటను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని