తెలిసే.. వదిలేశారా?

అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 28 Mar 2024 05:21 IST

తిరుపతిలో ఈవీఎంల గోదాంకు కూతవేటు దూరంలోనే వైకాపా తాయిలాల నిల్వ

ఈనాడు డిజిటల్‌, తిరుపతి - రేణిగుంట, న్యూస్‌టుడే: అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండ్రోజులుగా రేణిగుంటలో జరిగిన వరుస ఘటనలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. తిరుపతి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలను గత ఏడాది సెప్టెంబర్‌ 28న అప్పటి కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి పర్యవేక్షణలో రేణిగుంటలోని సెంట్రల్‌ వేర్‌హౌస్‌ గోదాంలో భద్రపరిచారు. అయితే దానికి పక్కనే ఉన్న గోదాంలో వైకాపా నేతలు తాయిలాలు నిల్వ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కానుకలు అవసరమున్న ప్రతిసారీ ఆ పార్టీ నాయకులు నేరుగా అక్కడికి చేరుకుని పట్టుకెళ్లడం.. జనాలకు పంచిపెట్టడం కొనసాగినట్లు స్పష్టమవుతోంది. అధికారులు పలుమార్లు ఈవీఎంల పరిశీలనకు వెళ్లినా.. పక్కనే ఉన్న ఇతర గోదాముల్లో ఏమున్నాయనే ఆలోచన చేయలేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. పోలీసు యంత్రాంగం సైతం కావాలనే తనిఖీలు చేయకుండా వదిలేశారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా ప్రచార సామగ్రి పట్టుబడిన గోదాంకు బుధవారం రాత్రి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పర్యవేక్షణలో రెవెన్యూ సిబ్బంది సీల్‌ వేశారు. అంతకుముందు జీఎస్టీ అధికారులు వచ్చి వివరాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని