నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?

తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్‌లు దొరికినా.. జిల్లా కలెక్టర్‌, ఆర్‌వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Published : 28 Mar 2024 05:41 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్‌లు దొరికినా.. జిల్లా కలెక్టర్‌, ఆర్‌వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఇలాంటి డంప్‌లు మరో నాలుగు ఉన్నాయని సాక్ష్యాధారాలతో సహా నిరూపించినా తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దల ఒత్తిళ్లతో అధికారులు స్పందించడం లేదని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘వైకాపా డంప్‌ల్లో కుక్కర్లు, గొడుగులు, ఫ్యాన్లు వంటి 52 రకాల సామగ్రితో పాటు నగదు ఉన్నట్లు సమాచారం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే తాయిలాలు పంచేందుకు పన్నిన కుట్రను తెదేపా నాయకులు బట్టబయలు చేశారు. ఈ డంప్‌ వెనుక ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి ఉన్నారు. వారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి. దీనిలో ప్రమేయం ఉన్న తాడేపల్లి పెద్దలపైనా చర్యలు తీసుకోవాలి’ అని డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని