రూ. 700 కోట్ల ఆస్తి.. ఒక్క వాహనమూ లేదు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా ప్రకటించారు.

Published : 29 Mar 2024 02:53 IST

ఎన్నికల అఫిడవిట్‌లో నకుల్‌నాథ్‌

భోపాల్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా ప్రకటించారు. మధ్యప్రదేశ్‌ నుంచి ఛింద్వాడా నుంచి 2019లో ఎంపీగా పోటీ చేసి నెగ్గిన నకుల్‌, మళ్లీ అదే స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే నకుల్‌ ఆస్తుల విలువ రూ.40 కోట్లు పెరిగింది. ఇందులో నగదు, షేర్లు, బాండ్లు ఇతర చరాస్తుల విలువ రూ.649.51 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.48.07 కోట్లు. ఇందులో ఒక్క వాహనమూ లేకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని