మమతకు మృత్యుఘంటిక మోగుతోంది

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మృత్యుఘంటిక మోగడం మొదలైందని తమ్‌లుక్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్య సరికొత్త దుమారానికి కారణమైంది.

Published : 29 Mar 2024 02:55 IST

భాజపా అభ్యర్థి జస్టిస్‌ గంగోపాధ్యాయ్‌ వ్యాఖ్య

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మృత్యుఘంటిక మోగడం మొదలైందని తమ్‌లుక్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్య సరికొత్త దుమారానికి కారణమైంది. ఓ విలేకరితో మాట్లాడుతూ ఆయన ఇలా చెప్పినట్లు వీడియో వెలుగుచూసింది. మమత మరణాన్ని ఆయన కోరుకుంటున్నారా అని తృణమూల్‌ ప్రశ్నించింది. ‘శత్రువు విషయంలోనైనా చావును కోరుకుంటామా? భాజపాను ఓటమి భయం వెంటాడుతోంది. ఇలాంటి వ్యాఖ్యలపై ఆ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే’నని ఆ పార్టీ సీనియర్‌ నేత శశిపాంజా అన్నారు. తృణమూల్‌ రాజకీయంగా మరణించబోతోందని చెప్పడమే ఆయన ఉద్దేశమని భాజపా స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని