రెండో విడత నామినేషన్లకు శ్రీకారం

లోక్‌సభ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 సీట్లకు వచ్చే నెల 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

Published : 29 Mar 2024 02:55 IST

89 సీట్లకు 26న పోలింగ్‌
ఔటర్‌ మణిపుర్‌లోని సగభాగానికి..

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 సీట్లకు వచ్చే నెల 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది. సంబంధిత నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరఫున ఎన్నికల సంఘం జారీ చేసింది. ఈ విడతలో అస్సాం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జమ్మూ కశ్మీర్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపుర, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లలోని 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు ఔటర్‌ మణిపుర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ ఏప్రిల్‌ 4. నామినేషన్ల పరిశీలన 5వ తేదీన జరుగుతుంది. జమ్మూ కశ్మీర్‌లో మాత్రం 6వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.

తొలి విడత పరిశీలన పూర్తి

తొలి విడతలో 102 లోక్‌సభ నియోజకవర్గాలకు నామినేషన్ల పరిశీలన గురువారం పూర్తయింది. ఈ విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్‌ 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు