మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలి

లోక్‌సభ ఎన్నికల్లో మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలని కోరుతూ తెలంగాణ మాదిగ దండోరా, మాదిగ జేఏసీ ప్రతినిధులు దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు.

Updated : 29 Mar 2024 05:36 IST

దిల్లీలో తెలంగాణ మాదిగల ధర్నా

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలని కోరుతూ తెలంగాణ మాదిగ దండోరా, మాదిగ జేఏసీ ప్రతినిధులు దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 80లక్షలమంది ఉన్న మాదిగలను కాదని.. 12 లక్షలమంది ఉన్న మాలలకు నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి సీట్లు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. పార్టీకోసం పనిచేస్తున్న మాదిగ నాయకులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని 3 రిజర్వుడు లోక్‌సభ స్థానాల్లో రెండింటిని మాదిగలకు కేటాయించాలని, పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని