ఎన్‌ఎస్‌యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ

కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు.

Published : 29 Mar 2024 05:45 IST

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. గతంలో కార్యదర్శిగా పనిచేసిన ఆమెకు ఇప్పుడు పదోన్నతి కల్పించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌యూఐకి కొత్త జాతీయ పదాధికారులను నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 8 మంది ప్రధాన కార్యదర్శుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అనులేఖకు మాత్రమే స్థానం దక్కింది. 48 మంది కార్యదర్శుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బిర్రు సంపత్‌కుమార్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని