కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.

Published : 29 Mar 2024 04:00 IST

ఛైర్మన్‌గా మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఛైర్మన్‌గా, పీసీసీ అధికార ప్రతినిధి ప్రొ.అల్దాస్‌ జానయ్యను కన్వీనర్‌గా నియమించింది. వారితోపాటు పీసీసీ మేధావుల సెల్‌ ఛైర్మన్‌ అనంతుల శ్యాంమోహన్‌, మాజీ ఎమ్మెల్సీ బి.కమలాకర్‌రావు, ఎన్నారై సెల్‌ ఛైర్మన్‌ డా.బి.ఎం.వినోద్‌కుమార్‌, పీసీసీ అధికార ప్రతినిధి డా.రియాజ్‌, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.జనక్‌ ప్రసాద్‌లను సభ్యులుగా నియమించింది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఈ కమిటీని నియమించినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని