పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?

రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు.

Updated : 29 Mar 2024 07:16 IST

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం

నాగలాపురం, న్యూస్‌టుడే: రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. నాగలాపురంలోని తెదేపా మండలాధ్యక్షుడు శ్రీనివాసులుయాదవ్‌ నివాసంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన గురువారం సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా అధిష్ఠానం సత్యవేడు నియోజకవర్గానికి సరఫరా చేసిన రూ.15 కోట్ల నగదును పెద్దిరెడ్డి దళితులను నమ్మకుండా ఆయన అనుచరుడైన బీరేంద్రరాజుతో ఖర్చుపెట్టించి సింహభాగాన్ని లూటీ చేశారన్నారు. సత్యవేడులో ఇసుక, గ్రావెల్‌, ఎర్రచందనం వంటి వనరులను విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, బీరేంద్రరాజు, పొంగులేటి వంటివారు స్వాహా చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి మనిషి అంటూ గురుమూర్తికి టికెట్‌ ఇవ్వడం, అధిష్ఠానం వద్ద ఆవేదన వ్యక్తం చేసే తనలాంటి వారికి నిరాకరించడం వైకాపా నేతల నైజమని విమర్శించారు. జగన్‌ పేరుకే వైకాపా అధినేత అని, అంతా పెద్దిరెడ్డి కనుసన్నల్లో జరుగుతుండటాన్ని చూస్తుంటే ఎవరు అధినేతనే సందేహం కలుగుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని