వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన!

రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి.

Published : 29 Mar 2024 04:12 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. తొలి విడతగా 70 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పొటీ చేసే అభ్యర్థుల వివరాలు వెల్లడించనున్నారు. సీపీఎం, సీపీఐ పార్టీలు చెరో 15 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించే ఇండియా కూటమి సమావేశంలో ఏపీలో ఎవరెవరు ఎన్ని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలన్న విషయమై స్పష్టత రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని