వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు.

Published : 29 Mar 2024 04:12 IST

తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరించారని అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్ర యాదవ్‌ ఆరోపిస్తూ వైకాపా సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన కుమార్తెలు.. నగరపాలిక 48, 49 డివిజన్ల కార్పొరేటర్లు అన్నా అనిత యాదవ్‌, అన్నా సంధ్య యాదవ్‌ సైతం అదేబాటలో తమ పదవులకు రాజీనామా చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం వారు మాట్లాడారు. తమ తండ్రి వాస్తవాలు మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక సొంత పార్టీ నాయకులే దూషించడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడిన నోర్లు తమ కులంవారివే అయినా గొంతు మాత్రం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అభినయరెడ్డిదేనని విమర్శించారు. తమ తండ్రి రాజీనామా అనంతరం పార్టీ నాయకులు అడిగినందుకే రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు. అన్నా రామచంద్ర యాదవ్‌ మాట్లాడుతూ తమ కుటుంబం మేయర్‌ పదవిని ఆశించినట్లు నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని