ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు

నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి మంతనాలు సాగించారు.

Published : 29 Mar 2024 04:14 IST

రేపు పార్టీలో చేరే అవకాశం?

బనగానపల్లి, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి మంతనాలు సాగించారు. రాత్రి కాటసాని ఇంటికి వెళ్లిన వారు గంటకు పైగా చర్చలు జరిపారు. తెదేపాలోకి రావాలని ఆహ్వానించారు. అంతకు ముందు ఇంటికి వచ్చిన బైరెడ్డిని సాదరంగా ఆయన ఆహ్వానించారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డి, కాటసాని చంద్రశేఖరెడ్డిల మధ్య 1990 నుంచి స్నేహపూర్వక వాతావరణం ఉంది. 1994లో తెదేపా తరఫున పాణ్యం నుంచి పోటీ చేసిన కాటసాని చంద్రశేఖరరెడ్డి సొంత సోదరుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి(కాంగ్రెస్‌)చేతిలో ఓడిపోయారు. కొంత కాలంగా చంద్రశేఖరరెడ్డి వైకాపాలో కొనసాగుతున్నారు. ఆయనతో తెదేపా నేతలు జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలిసింది. శుక్రవారం చంద్రబాబు నాయుడి సమక్షంలో తెదేపాలో చేరే అవకాశం ఉంది. ఈ విషయంపై చంద్రశేఖరరెడ్డి స్పందన కోరగా కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని