బిహార్‌లో ఇండియా కూటమి లోక్‌సభ సీట్లు ఖరారు

బిహార్‌లో ఇండియా కూటమి లోక్‌సభ సీట్ల పంపకం పూర్తయింది. మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు గానూ 26 స్థానాల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ పోటీ చేయనుంది.

Published : 30 Mar 2024 04:48 IST

ఆర్జేడీ-26, కాంగ్రెస్‌-9, వామపక్షాలు-5 స్థానాల్లో పోటీ

పట్నా: బిహార్‌లో ఇండియా కూటమి లోక్‌సభ సీట్ల పంపకం పూర్తయింది. మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు గానూ 26 స్థానాల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ పోటీ చేయనుంది. 9 చోట్ల కాంగ్రెస్‌, మిగిలిన అయిదు చోట్ల మూడు వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో దిగనున్నారు. 2019 ఎన్నికల్లో 17 సీట్లలో పోటీ చేసి అన్ని చోట్లా ఓడిపోయిన ఆర్జేడీ.. ఈసారి 26 స్థానాల్లో బరిలో దిగనుంది. పూర్ణియా, ఔరంగాబాద్‌ టికెట్లను కాంగ్రెస్‌ ఆశిస్తుండగా, వాటిని ఆర్జేడీ చేజిక్కించుకుంది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన జన్‌ అధికార పార్టీ నేత పప్పూ యాదవ్‌ను పూర్ణియా నుంచి బరిలో దింపాలని హస్తం పార్టీ భావించింది. ఔరంగాబాద్‌లో మాజీ ఐపీఎస్‌ అధికారి నిఖిల్‌ కుమార్‌ను అభ్యర్థిగా నిలబెట్టే యోచన చేసింది. ఈ రెండు సీట్లనూ ఆర్జేడీ తీసుకోవడంతో కాంగ్రెస్‌ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కథియార్‌, కిషన్‌గంజ్‌, పట్నా సాహిబ్‌, ససారాం, భాగల్‌పుర్‌, వెస్ట్‌ చంపారన్‌, ముజఫర్‌పుర్‌, సమస్తిపుర్‌, మహరాజ్‌గంజ్‌ సీట్లను కాంగ్రెస్‌కు కేటాయించారు. బెగుసరాయ్‌, ఖగారియా, అర్హ్‌, కరకట్‌, నలంద స్థానాల నుంచి వామపక్ష అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని