రేపటి ‘మహార్యాలీ’కి అతిరథ, మహారథులు

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఆదివారం దేశ రాజధానిలో చేపడుతున్న ‘మహార్యాలీ’కి ఇండియా కూటమి అగ్రనాయకులు హాజరవుతారని ఆప్‌ నేత గోపాల్‌రాయ్‌ శుక్రవారం తెలిపారు.

Published : 30 Mar 2024 04:49 IST

హాజరవుతున్న ఖర్గే, పవార్‌, రాహుల్‌, ఉద్ధవ్‌ తదితరులు
ఆప్‌ నేత గోపాల్‌రాయ్‌ వెల్లడి

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఆదివారం దేశ రాజధానిలో చేపడుతున్న ‘మహార్యాలీ’కి ఇండియా కూటమి అగ్రనాయకులు హాజరవుతారని ఆప్‌ నేత గోపాల్‌రాయ్‌ శుక్రవారం తెలిపారు. రామ్‌లీల మైదానంలో నిర్వహించే ఈ ర్యాలీలో కూటమి పార్టీల నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌లతో పాటు ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌(ప్రస్తుతం జైల్లో ఉన్నారు) సతీమణి కల్పనా సోరెన్‌, ప్రస్తుత సీఎం చంపయీ సోరెన్‌ పాల్గొంటారని పేర్కొన్నారు. టీఎంసీ నేత డెరెక్‌ ఓబ్రియన్‌, డీఎంకే నాయకుడు తిరుచి శివ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని గోపాల్‌రాయ్‌ వెల్లడించారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా అధికార భాజపాకు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ‘ఇండియా’ కూటమి ప్రారంభించనుంది. మహార్యాలీకి దిల్లీ పోలీసుల నుంచి ఆప్‌ అనుమతి తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని