తెదేపా ఎన్నికల సమన్వయకర్తగా దేవినేని ఉమా

తెదేపా ఎన్నికల సమన్వయకర్తగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఆ పార్టీ నియమించింది.

Published : 30 Mar 2024 04:59 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ఎన్నికల సమన్వయకర్తగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఆ పార్టీ నియమించింది. ఈ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఆయన సమన్వయకర్తగా వ్యవహరిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అదనమని పేర్కొన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు నియామకం చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని