5న కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల!

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో ఏప్రిల్‌ 5న విడుదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించాయి.

Published : 30 Mar 2024 05:00 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో ఏప్రిల్‌ 5న విడుదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించాయి. ఏప్రిల్‌ 6న జైపుర్‌, హైదరాబాద్‌లలో నిర్వహించే బహిరంగ సభల్లో మేనిఫెస్టోలోని అంశాలకు విస్తృత ప్రచారం కల్పించేలా మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ప్రసంగాలు ఉంటాయని తెలిపాయి. ఇంటింటికీ గ్యారెంటీ ప్రచారం ఏప్రిల్‌ 3న ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ నేతలు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని