మా కోసం ఏం చేశారని.. వైకాపా జెండా పట్టుకుని తిరగమంటారు!

‘అయిదేళ్లలో మా జీతాలు పెంచలేదు. ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఇప్పుడేమో రాజీనామా చేసి వైకాపా జెండా పట్టుకుని ప్రచారంలో పాల్గొనమంటున్నారు.

Updated : 30 Mar 2024 05:03 IST

జీతాలు పెంచలేదు, ఉద్యోగ భద్రత కల్పించలేదు
ప్రచారం కోసం రాజీనామా చేయాలన్న అధికారిని నిలదీసిన వాలంటీరు

ఈనాడు, తిరుపతి: ‘అయిదేళ్లలో మా జీతాలు పెంచలేదు. ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఇప్పుడేమో రాజీనామా చేసి వైకాపా జెండా పట్టుకుని ప్రచారంలో పాల్గొనమంటున్నారు. పార్టీలకతీతంగా 50 కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందేలా పనిచేశాం. కానీ వైకాపా కార్యకర్తలుగా ఉండటానికి ఇందులో చేరలేదు’ అని ఓ వాలంటీరు తేల్చిచెప్పారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలస్థాయి అధికారి చెంగయ్య(ఎంఎల్‌వో) తన పరిధిలోని వాలంటీర్లతో వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడుతూ.. అందరూ రాజీనామా చేసి వైకాపా తరఫున ప్రచారం చేయాలని కోరారు. అందుకు ఆమోదమేనా అని ప్రశ్నించగా ఓ వాలంటీరు పైవిధంగా స్పందించారు. తిరిగి వైకాపా అధికారంలోకి వస్తుందని, రెండు నెలలు జగనన్న కోసం త్యాగం చేయాలంటూ సదరు అధికారి పేర్కొనడం గమనార్హం. సిద్ధమైన వారు అవును అని, లేదంటే కాదని సంక్షిప్త సమాచారం ఇవ్వాలన్నారు. ఇందుకు సంబంధించిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని