‘పాంచ్‌ న్యాయ్‌’పై విస్తృత ప్రచారం చేయాలి

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచారం చేసే అంశాలు, గ్యారంటీ హామీల అమలుపై ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందించాలని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ సూచించారు.

Published : 30 Mar 2024 05:03 IST

కాంగ్రెస్‌ ప్రచార కమిటీ సమావేశంలో దీపా దాస్‌మున్షీ

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచారం చేసే అంశాలు, గ్యారంటీ హామీల అమలుపై ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందించాలని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సమావేశం శుక్రవారం గాంధీభవన్‌లో కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ అధ్యక్షతన జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌధరి, విష్ణునాథ్‌, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన దీపా దాస్‌మున్షీ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో చేపట్టిన పార్టీ ప్రచార కార్యక్రమాలను పోలింగ్‌బూత్‌ స్థాయి వరకు తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. తుక్కుగూడలో 6వ తేదీన నిర్వహించే సభలో కాంగ్రెస్‌ జాతీయ మ్యానిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. ‘పాంచ్‌ న్యాయ్‌’ పేరుతో మ్యానిఫెస్టోలో తెలిపే హామీలపై పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మధుయాస్కీ మాట్లాడుతూ.. ప్రచార కమిటీ సభ్యుల కృషితో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.  ‘పదేళ్ల దుర్మార్గ పాలన’ పేరుతో రూపొందించిన ప్రచార పత్రాన్ని ఈ సందర్భంగా నేతలు విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని