సీఎం మాటలకు హద్దులు లేకుండా పోతున్నాయి

సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు హద్దులు లేకుండా పోతున్నాయని, గతంలో మల్కాజిగిరిలో గెలిచిన ఆయన ప్రజా సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విమర్శించారు.

Updated : 30 Mar 2024 06:19 IST

ఈటల రాజేందర్‌

మారేడుపల్లి, న్యూస్‌టుడే: సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు హద్దులు లేకుండా పోతున్నాయని, గతంలో మల్కాజిగిరిలో గెలిచిన ఆయన ప్రజా సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని మహేంద్రహిల్స్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో 8 మంది భాజపా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ భాజపాకు 60 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకురావడం పెద్ద విషయం కాదన్నారు. ప్రధాని మోదీ రోడ్‌షోతో మల్కాజిగిరిలో భాజపాకు మద్దతు పెరిగిందన్నారు. ఇక్కడ అనేక సమస్యలు పేరుకుపోయాయని, తనను గెలిపిస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్‌ మాదిరిగానే నాయకులు, కార్యకర్తలను డబ్బులతో కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. భారాసకు ఓటు వేస్తే వ్యర్థమవుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని