k keshava rao: నాన్నా.. నిర్ణయాన్ని మార్చుకో.. కేకేకు కుమారుడు విప్లవ్‌ వినతి

తన తండ్రి కె.కేశవరావు ఈ వయసులో భారాసను వీడడం బాధగా ఉందని, మరోసారి ఆలోచించి కాంగ్రెస్‌లోకి వెళ్లాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని కె.విప్లవ్‌ కుమార్‌ కేకేకు విజ్ఞప్తి చేశారు.

Updated : 30 Mar 2024 10:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: తన తండ్రి కె.కేశవరావు ఈ వయసులో భారాసను వీడడం బాధగా ఉందని, మరోసారి ఆలోచించి కాంగ్రెస్‌లోకి వెళ్లాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని కె.విప్లవ్‌ కుమార్‌ కేకేకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం భారాస నేతలు దాసోజు శ్రావణ్‌, మన్నె గోవర్ధన్‌రెడ్డి, బైండ్ల విజయ్‌కుమార్‌, నారాయణ తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఏవో పదవుల కోసం కేకే కాంగ్రెస్‌కు వెళ్తున్నారని నేను అనుకోవడం లేదు. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భారాసను వీడను. మా నాన్నపై నేను చేసిన వ్యాఖ్యల వెనుక భారాస పెద్దల హస్తం ఉందనే వాదన అర్థరహితం’’ అని విప్లవ్‌ కుమార్‌ తెలిపారు. దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ.. ‘‘భారాసలో దానం నాగేందర్‌కు ఏ ఆత్మగౌరవం దక్కలేదు? రేవంత్‌రెడ్డి ఏ సామాజిక న్యాయం పాటిస్తున్నారని ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతున్నారు? ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, కేకే రాజీనామా చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని