సీఎఫ్‌ఎంఎస్‌ను దుర్వినియోగం చేసిన ప్రభుత్వం

ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత, నియంత్రణ కోసం తీసుకొచ్చిన సీఎఫ్‌ఎంఎస్‌ (కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం)ను వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 30 Mar 2024 05:06 IST

కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత, నియంత్రణ కోసం తీసుకొచ్చిన సీఎఫ్‌ఎంఎస్‌ (కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం)ను వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాకు అనుకూలంగా ఉన్నవారికే బిల్లులు చెల్లింపులు చేశారని ఆరోపించారు. సీఎఫ్‌ఎంఎస్‌ను కచ్చితంగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సహా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరుతూ..కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. ‘‘గత అయిదేళ్లుగా అడ్డగోలుగా రూ.లక్ష కోట్ల బిల్లుల్ని ఆమోదించి, చెల్లింపులు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో 2024 మార్చి 16 తర్వాత చెల్లించిన బిల్లులపై నివేదిక ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి’’ అని లేఖలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని