వరంగల్‌కు కొత్త అభ్యర్థి వెతుకులాటలో భారాస

వరంగల్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీకి నిరాకరించి హస్తం గూటికి చేరుతుండటంతో మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి భారాసలో ఏర్పడింది.

Published : 30 Mar 2024 05:06 IST

తాటికొండ రాజయ్యతో పాటు పలువురి పేర్లు తెరపైకి

ఈనాడు, వరంగల్‌: వరంగల్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీకి నిరాకరించి హస్తం గూటికి చేరుతుండటంతో మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి భారాసలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. సిటింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఇలా కీలక నేతలంతా పార్టీలు మారడంతో ఇప్పుడు వరంగల్‌ నుంచి గట్టి అభ్యర్థిని బరిలో నిలిపే దిశగా భారాస కసరత్తు చేస్తోంది. పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఇటీవల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రస్తుతం ఎందులోనూ చేరలేదు. ఆయన్ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి వరంగల్‌ నుంచి పోటీకి దింపాలని భారాస నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఆయన్ను వరంగల్‌ లోక్‌సభ నుంచి పోటీ చేయిస్తే కడియంకు గట్టి ప్రత్యర్థిగా ఉంటారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి స్వప్న, జోరిక రమేశ్‌, బోడ డిన్నలు వరంగల్‌ టికెట్‌ పట్ల ఆసక్తిగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని