చంద్రన్న నాయకత్వంతో తెగదెంపులు

పార్టీయేతర కార్యకలాపాల వైపు దృష్టి సారించిన సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రన్న నాయకత్వంతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ఆ పార్టీ కన్వీనర్‌ సాదినేని వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

Published : 30 Mar 2024 05:07 IST

సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కన్వీనర్‌ సాదినేని వెంకటేశ్వర్‌రావు

నల్లకుంట, న్యూస్‌టుడే: పార్టీయేతర కార్యకలాపాల వైపు దృష్టి సారించిన సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రన్న నాయకత్వంతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ఆ పార్టీ కన్వీనర్‌ సాదినేని వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరులో ఇటీవల జరిగిన పార్టీ నేత నాదెండ్ల బ్రహ్మయ్య హత్య విషయంలో పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా చంద్రన్న ప్రవర్తించడమే కాకుండా, విప్లవ జీవితానికి భిన్నంగా వ్యవహరిస్తుండటంతో ఆయన నాయకత్వంతో తెగదెంపులు తీర్మానాన్ని ఈ నెల 24న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. ఇప్పటివరకు సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీగా కొనసాగిన తాము ఇకపైనా అదే పార్టీ పేరుతోనే కార్యకలాపాలు సాగిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని