ఎన్నికల తరువాత భారాస మనుగడ ప్రశ్నార్థకం

దేశ రాజకీయాల్లో నల్గొండకు ఒక చరిత్ర ఉందని, దేశంలోనే అత్యధిక మెజారిటీతో నల్గొండ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ గెలుస్తుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Published : 30 Mar 2024 05:08 IST

మంత్రి ఉత్తమ్‌

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: దేశ రాజకీయాల్లో నల్గొండకు ఒక చరిత్ర ఉందని, దేశంలోనే అత్యధిక మెజారిటీతో నల్గొండ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ గెలుస్తుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసిందని ఓట్లు అడుగుతోందని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల తరువాత భారాస మనుగడ ప్రశ్నార్థకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ 13 నుంచి 14 స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాకు మధ్యే పోటీ ఉంటుందన్నారు. నల్గొండ లోక్‌సభ స్థానం పరిధి ముఖ్యులతో జిల్లాలోని మఠంపల్లి మండలం మట్టపల్లిలో శనివారం సమావేశం నిర్వహిస్తున్నామని, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వస్తున్నారని తెలిపారు. సమావేశంలో టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సూర్యాపేట, నల్గొండ డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, శంకర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని