వరికి మద్దతు ధర రూ.2,700 చెల్లించాలి

కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 30 Mar 2024 05:10 IST

ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌

భీమ్‌గల్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇందుకోసం ప్రజల పక్షాన నిలబడి పోరాడతామన్నారు. ధాన్యానికి మద్దతు ధర క్వింటాకు రూ.2,200లతో పాటు రూ.500 బోనస్‌ కలిపి రూ.2,700 చెల్లించాలని కోరారు. ఈ విషయమై నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌లో భీమ్‌గల్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాల రైతులు, భారాస కార్యకర్తలతో కలిసి పోరుబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీలు నెరవేర్చకుంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు అడగొద్దన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని సీఎంను కోరితే హోదాను మరిచి బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదన్నారు. ఒకరిద్దరిని బెదిరించి కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకుంటే భారాసకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తగిన బుద్ధి చెబితేనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న భయం ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని