pawan kalyan: నేటి నుంచి పవన్‌ ప్రచారం

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శనివారం నుంచి ప్రారంభించనున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం వెల్లడించారు.

Updated : 30 Mar 2024 07:23 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శనివారం నుంచి ప్రారంభించనున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం వెల్లడించారు. తొలి విడతలో భాగంగా మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పవన్‌ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారని మనోహర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని