వీరప్ప మొయిలీ స్థానంలో యువ నేతకు కాంగ్రెస్‌ టికెట్‌

లోక్‌సభ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిదో జాబితాను శుక్రవారం విడుదల చేసింది. మరో రెండు స్థానాల్లో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను మార్చివేసింది.

Published : 30 Mar 2024 05:32 IST

చిక్కబళ్లాపుర బరిలో రక్షా రామయ్య...
బళ్లారి, చామరాజనగరలకు అభ్యర్థుల ప్రకటన

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిదో జాబితాను శుక్రవారం విడుదల చేసింది. మరో రెండు స్థానాల్లో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను మార్చివేసింది. కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత ఎం.వీరప్ప మొయిలీ(84) స్థానంలో యువ నేత రక్షా రామయ్యకు టికెట్‌ ఇచ్చింది. మొయిలీ ఈ స్థానం నుంచి లోక్‌సభకు 2009, 2014లలో ఎన్నికయ్యారు. 2019లో ఓటమి పాలయ్యారు. టికెట్‌ పొందిన రక్షా రామయ్య.. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం.ఆర్‌.సీతారాం కుమారుడు. బళ్లారి(ఎస్టీ) లోక్‌సభ నియోజక వర్గానికి ఇ.తుకారాం, చామరాజనగర(ఎస్సీ) స్థానానికి సునీల్‌ బోస్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ 211 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. రాజస్థాన్‌లోని భిల్వాడాలో సీనియర్‌ నేత సీపీ జోషీని బరిలోకి దించింది. ఈ స్థానానికి ఇప్పటికే ప్రకటించిన దామోదర్‌ గుర్జర్‌ను రాజసమంద్‌కు పంపించి.. జోషీకి అవకాశం కల్పించింది. సుదర్శన్‌ రావత్‌ స్థానంలో దామోదర్‌ గుర్జర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని