తెలంగాణలో భువనగిరి.. ఏపీలో అరకు సీపీఎం లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన

Published : 31 Mar 2024 04:03 IST

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 44 లోక్‌సభ స్థానాలకు సీపీఎం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఏపీలోని అరకు(ఎస్టీ) నుంచి పాచిపెంట అప్పలనరస, తెలంగాణలోని భువనగిరి నుంచి మహమ్మద్‌ జహంగీర్‌లను పోటీకి నిలపాలని నిర్ణయించింది. పశ్చిమబెంగాల్‌లో 17 స్థానాలకు, కేరళలో 15 స్థానాలకు, తమిళనాడుకు ఇద్దరు, మిగిలిన రాష్ట్రాలకు ఒక్కో అభ్యర్థిని ప్రకటించింది. కేరళలోని అలప్పుజ నుంచి సిటింగ్‌ ఎంపీ ఆరీఫ్‌, వడకర నుంచి కేకే శైలజ టీచర్‌, కోజికోడ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడు ఎలమరం కరీంను రంగంలోకి దింపింది. పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ నుంచి సీనియర్‌ నాయకుడు మహమ్మద్‌ సలీం పోటీ పడనున్నారు. తమిళనాడులోని మదురై నుంచి సిటింగ్‌ ఎంపీ ఎస్‌.వెంకటేశన్‌, దిండిగల్‌ నుంచి ఆర్‌.సచ్చిదానందం ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేయనున్నారు. బిహార్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, త్రిపురల్లో ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం పోటీచేస్తోంది. అండమాన్‌ నికోబార్‌, అస్సాం, ఝార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, పంజాబ్‌ల్లో వామపక్ష కూటమితో కలిసి రంగంలోకి దిగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని