కామారెడ్డిలో నెగ్గిన కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం

కామారెడ్డి పురపాలిక భారాస ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. పురపాలక సంఘం కార్యాలయంలో కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో శనివారం ఓటింగ్‌ జరగగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లతో పాటు భారాసకు చెందిన 10 మంది కౌన్సిలర్లు అనుకూలంగా ఓటు వేశారు.

Published : 31 Mar 2024 04:04 IST

భారాస కౌన్సిలర్ల మద్దతుతో విజయం

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: కామారెడ్డి పురపాలిక భారాస ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. పురపాలక సంఘం కార్యాలయంలో కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో శనివారం ఓటింగ్‌ జరగగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లతో పాటు భారాసకు చెందిన 10 మంది కౌన్సిలర్లు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు వెల్లడించారు. ఛైర్‌పర్సన్‌ పదవికి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి యంత్రాంగం నివేదించింది. పురపాలికలో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస సమావేశానికి 34 మంది కోరం ఉండాల్సి ఉండగా అదనంగా ముగ్గురు మద్దతు తెలిపారు. కాగా భారాసలోనే ఉంటూ పది మంది కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం అనైతికమని ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి తండ్రి వేణుగోపాల్‌రావు ఆరోపించారు. ఇప్పటికే అవిశ్వాస ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ ఛైర్‌పర్సన్‌ జాహ్నవి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వచ్చే నెల 12వ తేదీన విచారణ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు