దిల్లీలో నేడు సీఈసీ సమావేశం

కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం ఆదివారం సాయంత్రం దిల్లీలో జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

Published : 31 Mar 2024 04:04 IST

మిగిలిన 4 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారు!
హాజరు కానున్న సీఎం రేవంత్‌, భట్టి, ఉత్తమ్‌

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం ఆదివారం సాయంత్రం దిల్లీలో జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం దిల్లీ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకుగానూ ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. మిగిలిన ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఆదివారం జరిగే సమావేశంలో సీఈసీ ఖరారు చేస్తుందని అంచనా. కాంగ్రెస్‌ రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు.. వరంగల్‌ టికెట్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు, ఖమ్మం ప్రసాద్‌రెడ్డి లేదా రఘురామిరెడ్డి, కరీంనగర్‌ తీన్మార్‌ మల్లన్న, ప్రవీణ్‌రెడ్డి లేదా ఒక మాజీ మంత్రి, హైదరాబాద్‌ అభ్యర్థిగా మైనార్టీ లేదా బీసీ వర్గానికి చెందిన పార్టీ నేత పేర్లను సీఈసీ పరిశీలించి నిర్ణయిస్తుందని సమాచారం. ఆదివారం రాత్రికల్లా 4 స్థానాలకు అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని నేతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని