సాగు నీరందించే వరకు పోరాటం

యాసంగిలో చేతికొచ్చిన పంటలు పాలకుల నిర్లక్ష్యంతో ఎండిపోతున్నాయని, సాగు నీరందించేంత వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని మాజీ మంత్రి, పెద్దపల్లి లోక్‌సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

Published : 31 Mar 2024 04:06 IST

రైతు నిరసన దీక్షలో మాజీ మంత్రి ఈశ్వర్‌

పెద్దపల్లి, న్యూస్‌టుడే: యాసంగిలో చేతికొచ్చిన పంటలు పాలకుల నిర్లక్ష్యంతో ఎండిపోతున్నాయని, సాగు నీరందించేంత వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని మాజీ మంత్రి, పెద్దపల్లి లోక్‌సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని భారాస కార్యాలయ ఆవరణలో సాగునీటి కోసం చేపట్టిన 36 గంటల రైతు నిరసన దీక్షను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వెంటనే నీటిని విడుదల చేసి, పంటలను కాపాడాలన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. వ్యవసాయానికి కోతలు లేకుండా కరెంటు ఇవ్వాలని, రూ.2 లక్షల రుణ మాఫీని వెంటనే అమలు చేయాలన్నారు. ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతుబంధు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యాసంగి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లించాలన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన నిరసన దీక్ష ఆదివారం సాయంత్రం వరకు కొనసాగనుంది. కార్యక్రమంలో భారాస జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జడ్పీ ఛైర్‌పర్సన్లు పుట్ట మధూకర్‌, దావ వసంత, జక్కు శ్రీహర్షిణి, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, దివాకర్‌రావు, బాల్క సుమన్‌, పార్టీ నాయకులు చిరుమల్ల రాకేశ్‌, దాసరి ఉష, కౌశిక హరి, ఉప్పు రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు