ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోన్న భాజపా: సీఎం విజయన్‌

కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయి విజయన్‌ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి పన్నియన్‌ రవీంద్రన్‌ తరఫున తిరువనంతపురంలో నిర్వహించిన సభలో విజయన్‌ పాల్గొన్నారు.

Published : 31 Mar 2024 04:18 IST

తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయి విజయన్‌ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి పన్నియన్‌ రవీంద్రన్‌ తరఫున తిరువనంతపురంలో నిర్వహించిన సభలో విజయన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశంలోని లౌకిక, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోందని ధ్వజమెత్తారు. కేంద్రం పదేపదే అనుసరిస్తున్న విధానాల వల్ల దశాబ్దాల తరబడి దేశంలో నివసిస్తున్న ప్రజలు ఇక్కడ ఉండగలమా అని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను అమెరికా, జర్మనీ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వంటి సంస్థలు విమర్శిస్తున్నాయన్నారు. అలాగే రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 20 స్థానాలకు గానూ 19 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ పైనా విజయన్‌ విమర్శలు గుప్పించారు. ఆ కూటమి ఎంపీలు కేరళ ప్రయోజనాలు కోసం పార్లమెంటులో గొంతెత్తలేదని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని