జగన్‌కు మా దెబ్బేమిటో చూపిస్తాం

గుంటూరులో శనివారం నిర్వహించాల్సిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సభను రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో అడ్డుకుందని, త్వరలోనే సభ జరిపి తీరుతామని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్‌ మాదిగ అన్నారు.

Published : 31 Mar 2024 04:49 IST

ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్‌ మాదిగ

గుంటూరు (బ్రాడీపేట), న్యూస్‌టుడే: గుంటూరులో శనివారం నిర్వహించాల్సిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సభను రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో అడ్డుకుందని, త్వరలోనే సభ జరిపి తీరుతామని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్‌ మాదిగ అన్నారు. శనివారం గుంటూరు లాడ్జి కూడలిలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనల పేరుతో సభను అధికారులు అడ్డుకోవడం తగదన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వైకాపా అధినేత జగన్‌కు తమ దెబ్బ ఏమిటో చూపిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ భాజపాతోనే సాధ్యం అవుతుందని, మాదిగలు రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 7న గుంటూరులో మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో మాదిగ యువకుల సభ నిర్వహించి తీరతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని