మచిలీపట్నం లోక్‌సభ జనసేన అభ్యర్థిగా బాలశౌరి

మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శనివారం ప్రకటించారు.

Published : 31 Mar 2024 04:52 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శనివారం ప్రకటించారు. అదే స్థానం నుంచి వైకాపా సిటింగ్‌ ఎంపీగా ఉన్న బాలశౌరి సీఎం జగన్‌తో విభేదించి జనసేనలో చేరారు. గుంటూరుకు చెందిన ఈయన ఎంఏ పూర్తిచేసి, మైనింగ్‌ వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారవేత్తగా కొనసాగుతూ 2004లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి తెనాలి ఎంపీగా గెలిచారు. 2009లో నరసరావుపేట, 2014లో గుంటూరు స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా తరఫున మచిలీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని